30,453 పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖ అనుమతినిచ్చింది సంగతి తెలిసిందే. ఈ పోస్టుల్లో అధిక సంఖ్యలో విద్యాశాఖలో ఖాళీలు ఉన్నాయి. దీంతో ఈ ఖాళీలను భర్తీ చేయడానికి అర్హత పరీక్ష అయిన టెట్ నోటిఫికేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈనెల 26వ తేదీ నుంచి ఏప్రిల్ 12వ తేదీ వరకు టెట్‌కు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. జూన్ 12వ తేదీన పరీక్షలను నిర్వహించనున్నట్లు వెల్లడించింది.