వచ్చే ఏడాది బడ్జెట్లో వేతన జీవులకు ఊరట కలిగే అవకాశం ఉంది. ఆదాయపు పన్ను శ్లాబుల్లో మార్పులు జరగనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 30శాతం పన్ను కడుతున్న టాక్స్ పేయర్లకు కాస్త ఉపశమనం కలిగించేలా కేంద్రం చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. వీరికి పన్ను శాతాన్ని తగ్గించి 25శాతంకు పరిమితం చేయాలని యోచిస్తోందట. ప్రస్తుతం ఆదాయపు పన్ను 4 శ్లాబుల్లో అందుబాటులో ఉంది. గతేడాది బడ్జెట్లో వేతన జీవులకు ఏదైనా ఊరట దక్కుతుందని అంతా ఊహించారు. కానీ నిరాశే ఎదురైంది. జీవన వ్యయం పెరడగడం, ద్రవ్యోల్బణం కారణంగా వేతన జీవులు సతమతమవుతున్నారు.