దిల్లీలో నిర్వహించిన రిపబ్లిక్ డే పరేడ్ డ్రస్ రిహార్సల్లో ఏపీలోని కోనసీమ ప్రభల తీర్థ శకటం అలరించింది. పరేడ్ అగ్రభాగంలో ఆంధ్రప్రదేశ్ శకటం చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. శివపార్వతుల విగ్రహాలతో ప్రభల తీర్థాన్ని రిహర్సల్స్లో ప్రదర్శించారు. ముందుభాగంలో జోడెడ్లపై రైతన్న కూర్చొని ఉండేలా రూపొందించారు. గణతంత్ర దినోత్సవం రోజున పరేడ్లో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన శకటాలను ప్రదర్శిస్తారనే సంగతి తెలిసిందే. దీనికి అనుగుణంగా రిహార్సల్స్ చేపట్టారు.