జమ్మూకశ్మీర్, లద్దాఖ్ పూర్తిగా తమ దేశంలో అంతర్భాగమేనని భారత్ మరోసారి స్పష్టం చేసింది. ఈ అంశంపై ఐరాస వేదికగా పాక్ చేసిన అసత్య ఆరోపణలకు గట్టిగా బదులిచ్చింది. ‘ప్రపంచ మహిళ దినోత్సవం సందర్భంగా స్త్రీల భద్రతపై మనం చర్చిస్తున్నాం. ఈ సమయంలో జమ్మూకశ్మీర్‌పై పాకిస్థాన్ ప్రతినిధులు చేసిన పనికిమాలిన, నిరాధారమైన వ్యాఖ్యలను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాంటి ద్వేషపూరిత, అసత్య ప్రచారాలకు ప్రతిస్పందించడం కూడా దండగే’ అని భారత ప్రతినిధి రుచిరా కంబోజ్ మండిపడ్డారు.