తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్ వద్ద పోలీసులు అరెస్టు చేశారు. ఆయన వరంగల్ వెళ్తున్న క్రమంలో పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న సికింద్రాబాద్ అల్లర్లలో చనిపోయిన రాకేష్ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆయన వరంగల్ వెళ్తున్నారు.
**వరంగల్ రైల్వే స్టేషన్‌పై కూడా..**
ఇప్పటికే అగ్నిపథ్ జ్వాలలు దేశవ్యాప్తంగా మంట పెడుతున్నాయి. నిన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో రచ్చ చేసిన ఆందోళనకారులు.. ఈ రోజు రాకేష్ మృతదేహాన్ని తరలిస్తుండగా.. వరంగల్ రైల్వే స్టేషన్ మీద దాడి చేసేందుకు ప్రయత్నించారు. వీరి ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. లేకుంటే అక్కడ కూడా భారీ నష్టం జరిగి ఉండేదే.. రాకేష్ మృతదేహాన్ని స్టేషన్ లోకి తరలించేందుకు నిరసనకారులు ప్రయత్నిస్తున్నారు.
-
© File Photo
-
© File Photo