అలనాటి విశ్వసుందరి ఐశ్వర్యరాయ్‌కి రెవెన్యూ అధికారులు నోటీసులు పంపించారు. నాసిక్‌లోని ఓ భూమికి ఆమె పన్ను చెల్లించకపోవడంతో అధికారులు నోటీసులు ఇచ్చారు. ఏడాది కాలంగా ఐశ్వర్య రాయ్ పన్నులు చెల్లించడం లేదని నోటీసుల్లో పేర్కొన్నారు. ఐశ్వర్యం ఏడాదికి గానూ రూ.21,960 చెల్లించాల్సి ఉంది.10 రోజుల లోపు బకాయి చెల్లించకపోతే తగు చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొన్నారు.