సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అంటే వివాదాలకు మారుపేరు అని అందరికీ తెలిసిన సంగతే. అవసరంగా అన్ని విషయాల్లో దూరి.. వివాదాలను తెచ్చుకుంటాడు. ట్విట్టర్లో సంచలన పోస్టులు పెడతుంటాడు. వోడ్కా తాగుతూ.. అమ్మాయిలతో తిరుగుతాడని వర్మ గురించి ఎవరిని అడిగినా ఇదే చెప్తారు. అయితే, వర్మ సోదరి విజయలక్ష్మి ఆర్జీవీ గురించి అసలు విషయాలు బయటపెట్టింది. అసలు వర్మకు పెళ్లంటేనే గిట్టదని.. పెళ్లి వల్ల సమస్యలేమీ లేవు గానీ, అది నా అభిప్రాయం అంటాడు. ఇక ఆర్జీవీకి అమ్మాయిలంటే పిచ్చి కదా అని అడుగగా.. అమ్మాయిలను సంతోషపెట్టేలా మాట్లాడుతూ ఉంటాడు తప్ప ఎన్నడూ తప్పుగా ప్రవర్తించలేదని చెప్పకొచ్చింది.