తరచూ వివాదాస్పదమైన ట్వీట్లతో వార్తల్లో నిలిచే రామ్ గోపాల్ వర్మ మరోసారి వార్తల్లోకెక్కాడు. ఇప్పటికే పలుమార్లు బాలీవుడ్‌ను విమర్శించిన వర్మ మరోసారి విమర్శలు గుప్పించారు. ‘సౌత్ ఇండియన్ సినిమాలు థియేటర్లలో విజయం సాధించడం, నార్త్ సినిమాల పరాజయం చూస్తుంటే.. త్వరలో బాలీవుడ్ కేవలం ఓటీటీల కోసమే సినిమాలను చేయనున్నట్లు తెలుస్తోంది’ అని ట్వీట్ చేశాడు. ప్రస్తతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది.