పెరగనున్న బియ్యం ధరలు

© File Photo

దేశంలో బియ్యం ధరలు పెరగే అవకాశం ఉంది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో సాగు తగ్గిన నేపథ్యంలో దిగుబడి కూడా భారీగా తగ్గనుందని ఆహార మంత్రిత్వ శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో బియ్యం ధరలు పెరుగుతాయని అంటున్నారు. గత ఏడాది క్వింటాల్ బియ్యం ధర రూ.3,047 ఉండగా, సెప్టెంబర్‌ నాటికి రూ.3,357కు చేరింది. ఇక రిటైల్ ధరల్లో రూ.3,815గా సేల్ చేస్తున్నారు. మొత్తం బియ్యం ఉత్పత్తిలో ప్రధానంగా 85 శాతం ఖరీఫ్ నుంచే వస్తుంది. ఈసారి 6-7 మిలియన్ టన్నుల ధాన్యం ఉత్పత్తి తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Exit mobile version