ప్రజాస్వామ్యంలో నిరసన చేయడం ఒక హక్కు అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో సర్పంచ్ల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని ఆయన చెప్పారు. పంచాయతీ రాజ్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం దొంగిలించిందని ఆయన ఆరోపించారు. ‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సర్పంచులు సమిధలవుతున్నారు. ఫలితంగా గ్రామ పంచాయతీలకు నిధుల కొరత ఏర్పడింది. కొందరు సర్పంచులు, ఉపసర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వారిని ఆదుకోవాలి. నిరసన చేయడం మా హక్కు. సర్పంచులు కూడా ప్రభుత్వాన్ని నిలదీయాలి’ అని రేవంత్ పిలుపునిచ్చారు.