సివిల్స్‌లో 683వ ర్యాంకు సాధించిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన రింకూ సింగ్ గతంలో ప్రాణాలకు తెగించి మరి ఉద్యోగంలో నిజాయితిగా తన బాధ్యతను నిర్వర్తించాడు. అతడు యూపీ హార్పూర్లో సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్‌గా పనిచేసిన సమయంలో రూ.83 కోట్ల ఉపకారవేతన కుంభకోణాన్ని సాక్ష్యాలతో బయటపెట్టాడు. ఇందులో 8 మందిపై ఆరోపణలు రాగా.. కోర్టు నలుగురికి పదేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో అతడిపై ప్రతీకారం తీర్చుకునేందుకు పత్యర్థులు 7 రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక కన్ను కోల్పోయాడు, ముఖంపై గాయాలు ఏర్పడ్డాయి. అయినప్పటీకీ ధైర్యాన్ని కోల్పోకుండా ప్రయాణాన్ని కొనసాగించి ఇప్పుడు సివిల్స్‌లో 683వ ర్యాంకును సాధించాడు. ఏదేమైనప్పటికీ నేను ప్రజల సంక్షేమం కోసమే నిజాయితిగా పనిచేస్తానని చెప్తున్నాడు.