భారత వికెట్ కీపర్ రిషభ్ పంత్ ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రి నుంచి త్వరలోనే డిశ్చార్జ్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరుకు అతడిని ఇంటికి పంపనున్నట్లు సమాచారం. మోకాలి సర్జరీ పూర్తైన నేపథ్యంలో పంత్‌ను డిశ్చార్జ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత నెలన్నర పాటు రిహాబ్ సెంటర్లో కొన్ని రోజులపాటు కౌన్సెలింగ్ కూడా ఉంటుంది. పంత్ మైదానంలోకి దిగేది లేనిది మరో 2 నెలల్లో తెలియనుంది. కాగా పంత్ తన స్వస్థలం వెళ్తూ ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.