2022 సంవత్సరానికి సంబంధించి ఐసీసీ అత్యుత్తమ టెస్టు జట్టును ప్రకటించింది. ఇందులో భారత్ నుంచి రిషబ్ పంత్ ఒక్కడే చోటు దక్కించుకున్నాడు. జట్టుకు కెప్టెన్‌గా బెన్ స్టోక్స్‌ని ఐసీసీ ఎంపిక చేసింది. ఇక టెస్టు జట్టులో పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ కూడా చోటు సంపాదించాడు. ఉస్మాన్ ఖవాజా, క్రైగ్ బ్రాత్‌వైట్, మార్నస్ లబుషేన్, బెయిర్‌స్టో, కమిన్స్, రబాడ, నేథన్ లైయన్, జేమ్స్ అండర్సన్ సభ్యులుగా ఉన్నారు. 2022లో పంత్ 12 టెస్టు ఇన్నింగ్సులు ఆడాడు. మొత్తంగా 680 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, నాలుగు అర్ధశతకాలున్నాయి.