ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ ఆ జట్టు స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్‌ను ఆకాశానికెత్తేశాడు. తను చూసిన గొప్ప ఇన్నింగ్సులలో వార్నర్ (92*) ఇన్నింగ్స్ ఒకటని కొనియాడాడు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన డీసీ మొదటి ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. కానీ డేవిడ్ వార్నర్ పావెల్ అద్భుత పోరాటంతో డీసీ భారీ స్కోరు సాధించింది. లక్ష్యచేధనలో ఆరెంజ్ ఆర్మీ 186 పరుగులకే పరిమితమయింది. అసాధారణ పోరాటం చేసిన డేవిడ్ వార్నర్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.