రోడ్డు ప్రమాదం బారిన పడ్డాక టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ తొలిసారి స్పందించాడు. ట్విటర్ ద్వారా అందరికీ ధన్యవాదాలు చెప్పాడు. ఇటీవల చేసిన సర్జరీ విజయవంతమైందని తీపికబురు అందించాడు. ‘నేను కోలుకోవడానికి సహకరించిన వారికి, నేను కోలుకోవాలని ప్రార్థించిన వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మీ మధ్య ఉండడాన్ని గొప్పగా భావిస్తున్నా. ఇకనుంచి ఎదురయ్యే ప్రతి సవాలును స్వీకరిస్తా. నాకు మద్దతుగా నిలిచిన బీసీసీఐ, జేషాకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఇక మైదానంలో కలుద్దాం’ అంటూ ట్వీట్ చేశాడు. డిసెంబరు 30న పంత్ రోడ్డు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే.