బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ వచ్చే ఎన్నికల్లో గెలవడం కష్టమేనని ఒక సర్వేలో తేలింది. సునాక్‌తో పాటు మరో 15 మంది మంత్రులు కూడా ఓటమిని మూటగట్టుకుంటారని పేర్కొంది. బెస్ట్ ఫర్ బ్రిటన్ అనే సంస్థ ఈ సర్వే చేపట్టింది. వచ్చే ఎన్నికల్లో రిషి కేబినెట్ దాదాపుగా తుడిచిపెట్టుకుపోనుందని వెల్లడించింది. అంతా కొత్తవారే మంత్రులుగా ఉంటారని తెలిపింది. డొమినక్ రాబ్, స్వీవ్ బార్క్లే లాంటి ఉద్ధండులు కూడా ఓటమి చవిచూస్తారని.. మైకేల్ గోవ్, జెరేమి హంట్, బ్రేవర్మన్ గెలవొచ్చని వివరించింది.