తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కేవలం ఐదు రోజుల్లోనే 3,987 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శుక్రవారం 923 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. గురువారం ఈ సంఖ్య 836 గా ఉంది. కేసులు పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. మాస్కులు ధరిస్తూ కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచిస్తున్నారు.