దేశంలో వరుసగా ఆరోసారి ముడి చమురు ధరలు పెరిగాయి. నాలుగు నెలలకు పైగా విరామం తర్వాత చమురు సంస్థలు వరుసగా రేట్లు పెంచుతున్నాయి. ఇంధన ధరలను 6వ సారి సోమవారం లీటరుకు పెట్రోల్ పై రూ.30 పైసలు, డీజిల్ పై రూ.35 పైసలు పెంచారు. దీంతో హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర: రూ.112.71, డీజిల్ రేటు రూ.99.07కు చేరింది. ఇక ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.114.19 కాగా, డీజిల్ ధర రూ.98.50గా ఉంది.