రష్యా- ఉక్రెయిన్ యుద్ధం బంగారు ధరలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఈ దేశాల మధ్య పోరు స్టాక్ మార్కెట్ల పతనానికి కారణం కావడంతో తులం బంగారం ధర ఒక్కరోజే రూ.1000 పెరిగి రూ.52,000 చేరింది. అలాగే హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.52,040 ఉండగా, 22 క్యారెట్ల గోల్డ్ రూ.47,700గా ఉంది. దిల్లీలో తులం ఖరీదు రూ.1202 పెరిగి రూ.51,889కి చేరింది.