తెలంగాణలో పగటిపూట ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. వేసవికాలం అడుగుపెట్టడంతో ఆదివారం 37 డిగ్రీల సెల్సియస్ నుంచి చాలా జిల్లాల్లో 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పెద్దపల్లి జిల్లాలోని మంథనిలో 40.2, మహబూబాబాద్‌లోని కురివి, జగిత్యాలలోని రాయికల్‌లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ పేర్కొంది. రానున్న రోజుల్లో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉంది.