మనిషి జీవితంలో మొబైల్ ఫోన్ భాగమైపోయింది. ప్రతి ఒక్కరూ చేతిలో ఫోన్ లేనిదే బయటికి వెళ్లడం లేదు. ఫోన్ అధికంగా వాడడం వలన కళ్ళకు సమస్య వస్తుందని మనకు తెలిసిన విషయమే. కానీ అదే పనిగా మొబైల్‌ను వాడితే బొటనవేలుకు కూడా సమస్య వస్తుందని పలువురు నిపుణులు చెబుతున్నారు. బొటన వేలుతో కంటిన్యూగా స్క్రోల్ చేయడం, మెసేజ్ చేయడం ద్వారా కీళ్ల అరుగుదల అధికంగా ఉంటుందని చెబుతున్నారు. దీని ద్వారా బొటన వేలు నొప్పి మొదలవుతుందంటున్నారు. దీని బారి నుంచి తప్పించుకోవడానికి మొబైల్ వాడకం తగ్గించాలని సూచిస్తున్నారు.