తెలుగు బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదలైన కొత్తలో తేలిపోయినా.. రానురానూ ఆసక్తికరంగా సాగుతోంది. ఇప్పటికే రెండు వారాలు గడిచిపోయి మూడో వారంలోకి ప్రవేశించింది. మొదటివారంలో ముమైత్ ఖాన్, రెండో వారంలో శ్రీ రాపాక ఎలిమినేట్ అయి వెళ్లిపోయారు. ఇక, ఫస్ట్ వీక్ లో తేజస్వి, సెకండ్ వీక్ అనిల్ కెప్టెన్ అయ్యాడు. తాజాగా మూడో వారం జరిగిన కెప్టెన్సీ టాస్క్ లో గెలిచి ఆర్జే చైతూ కొత్త కెప్టెన్ అయ్యాడు. అయితే, చైతూ టాస్క్ ఆడకుండానే అఖిల్ వల్ల కెప్టెన్ గా ఎంపికయ్యాడు. బిగ్ బాస్ ఈ వారం ఇచ్చిన అంతా నా ఇష్టం టాస్క్ లో యాంకర్ శివ, అరియానా సీక్రెట్ టాస్క్ ఇవ్వడంతో వారు నేరుగా కెప్టెన్సీ పోటీదారులయ్యారు. మరోవైపు అషూరెడ్డి, హమీదా, ఆర్జే చైతూ, అనిల్ కూడా పోటీపడ్డారు. చివరి రౌండ్ లో చైతూ, శివ బదులుగా వేరే కంటెస్టెంట్స్ పోటీపడాలని చెప్పడంతో అఖిల్, అనిల్ పోటీపడ్డారు. వీరిద్దరిలో అఖిల్ గెలవడంతో చివరికి చైతూ ఈ వారం కెప్టెన్ గా ఎంపికయ్యాడు.