హైదరాబాద్ జలసౌధలో నిర్వహించిన కేఆర్‌ఎంబీ, ఆర్‌ఎంసీ సమావేశానికి తెలంగాణ సభ్యులు గైర్హాజరయ్యారు. జలవిద్యుత్ ఉత్పత్తి, వరద జలాల వినియోగంపై చర్చ, రూల్ కర్ఫ్స్ కోసం సిఫారుసులతో కూడిన నివేదికపై చర్చించేందుకు సమావేశం అయ్యింది. తెలంగాణ నుంచి ఎవ్వరూ రాకపోవటంతో ఏపీ సభ్యుల సంతకాలను ఆర్‌ఎంసీ తీసుకుంది. ఈ మేరకు కేఆర్‌ఎంబీకి నివేదిక సమర్పించనుంది. ఆర్‌ఎంసీ ముసాయిదా రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా ఉందని తెలంగాణ కేఆర్‌ఎంబీకి లేఖ రాసింది.