తిరుపతి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. చంద్రగిరి మండలం కల్ రోడ్డుపల్లి వద్ద కల్వర్టును కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడిక్కడే చనిపోయారు. మరికొందరికి గాయాలవ్వగా రుయా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఒకరు మృతిచెందారు. వీరంతా మహారాష్ట్రకు చెందినవారిగా గుర్తించారు. తిరుమలలో స్వామివారి దర్శనం చేసుకొని కారులో కాణిపాకం వెళ్తుండగా ఘటన జరిగింది.