పండగ వేళ హైదరాబాద్-విజయవాడ రహదారిపై ప్రమాదం జరిగింది. రెండు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఢీకొన్న ఘటనలో.. ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఓవర్‌టేక్ చేసే క్రమంలోనే ప్రమాదం జరిగిందని, ఆ సమయంలో ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్నారని పోలీసులు వెల్లడించారు. పదహారు మందికి స్వల్ప గాయాలు కాగా, మరో నలుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది.