దేశమంతా ఇప్పుడు ఎక్కడ చూసినా RRR క్రేజ్ కనిపిస్తుంది. నేపాల్‌లో థియేటర్లలో స్క్కీన్ల వద్దకు వెళ్లి డ్యాన్స్‌లు వేస్తున్నారు. తమిళనాడు సాలెంలో ఒక థియేటర్ వద్దకు సెకండ్ షో కోసం వచ్చిన వారితో రోడ్ మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇలా దేశంలోనే కాదు విదేశాల్లో కూడా సినిమా దుమ్ములేపుతుంది. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. విడుదలై మూడు రోజులైనా థియేటర్లకు ప్రేక్షకుల తాకిడి తగ్గట్లేదు.