దిల్లీలో ‘రాబిన్ హుడ్‌’ దొంగ అరెస్టు

© Envato

‘పెద్దోళ్లను కొట్టు, పేదోళ్లకు పంచిపెట్టు’ ఇది రాబిన్‌ హుడ్‌ స్టైల్. అదే తరహాలో ఖరీదైన ఇళ్లలో దొంగతనం చేస్తూ అందులో కొంతమేరకు పేదలకు పంచిపెడుతున్న గ్యాంగ్‌ లీడర్‌ను దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. 27 ఏళ్ల వసీమ్ అక్రమ్ అలియాజ్‌ ‘లంబూ’ గజదొంగ. 25 మందితో ఉన్న గ్యాంగ్‌కు లంబూ లీడర్‌. ఇప్పటిదాకా 160కి పైగా నేరాలు చేసిన లంబూ తాను దోచిన దాంట్లో కొంత పేదలకు పంచుతాడు. అందువల్ల అతడిక స్థానికంగా చాలా మద్దతు లభిస్తోంది. ఎంతో కాలంగా లంబూను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులు పక్కా ప్రణాళికతో గత శుక్రవారం అరెస్టు చేశారు.

Exit mobile version