విమాన టికెట్ ధరలోనే అంతరిక్ష ప్రయాణాలు చేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని స్కైరూట్ కో ఫౌండర్ చందన పవన్‌కుమార్ అన్నారు. వచ్చే పదేళ్లలో ఇది సాధ్యపడుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం 10 మంది పట్టే రాకెట్లు ఉన్నాయని, భవిష్యత్‌లో వందల మంది పట్టే రాకెట్లు తయారవుతాయని చెప్పారు. రాకెట్ల తయారీలో హైదరాబాద్ కీలకంగా మారుతుందని, రాకెట్ సిటీగా తయారవుతుందని చెప్పారు. తక్కువ ఖర్చుతో ఉపగ్రహాలను ప్రయోగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.