ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన భారత ఆటగాళ్ల తీరుపై బీసీసీఐ ఆందోళన వ్యక్తం చేసింది. ఈసారి బయోబబుల్ లేకుండానే వెళ్లిన ఆటగాళ్లు అక్కడ కొవిడ్ నిబంధనలు పాటించకపోవడంపై బోర్డు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోహ్లీ, రోహిత్ అభిమానులతో కలిసి దిగిన ఫోటోలు వైరల్ కావడం, అందులో వారికి కనీసం మాస్క్ లేకపోవడం పట్ల బీసీసీఐ హెచ్చరించినట్లు తెలుస్తోంది. కరోనా కేసులు తగ్గినా ఆటగాళ్లు జాగ్రత్తగా ఉండాలని బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ తెలిపాడు. మరోవైపు ద్రవిడ్, శ్రేయస్ అయ్యర్, పంత్ ఇంగ్లండ్ కు పయనమయ్యారు. కరోనాతో టెస్టుకు దూరమైన అశ్విన్ క్వారంటైన్‌లో కొనసాగుతున్నాడు.