• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • టీ20ల నుంచి రోహిత్, కోహ్లీ ఔట్?

    టీ20ల నుంచి రోహిత్, కోహ్లీలు శాశ్వతంగా తప్పుకొన్నట్లేనా? ఇక నుంచి పొట్టి ఫార్మాట్‌లో ఈ ఇద్దరు లెజెండ్లు ప్రాతినిథ్యం వహించరా? అంటే అవుననే సమాధానాలే వస్తున్నాయి. టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా ఇందుకు సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. టీ20ల నుంచి రోహిత్, కోహ్లీలను పూర్తిగా పక్కన పెట్టే యోచనలో ఉన్నారట. జనవరి 27న న్యూజిలాండ్‌తో టీమిండియా 3 మ్యాచుల టీ20 సిరీస్‌ను ఆడనుంది. ఈ సిరీస్‌కు రోహిత్, కోహ్లీలకు విశ్రాంతి ఇచ్చినట్లు రాహుల్ ద్రవిడ్ స్పష్టం చేశారు. శ్రీలంకతో టీ20 సిరీస్‌కు కూడా వీరిని పక్కన పెట్టడం గమనార్హం.