జనవరి 3 నుంచి 15 వరకు జరిగే శ్రీలంక సిరీస్‌కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, ఓపెనర్ కేఎల్ రాహుల్ దూరం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సిరీస్ జరిగే సమయంలో రాహుల్ పెళ్లి వేడుక ఉండటం ఇందుకు కారణం. ఇక బొటనవేళి గాయం నుంచి రోహిత్ శర్మ పూర్తిగా కోలుకున్నట్లు కనిపించడం లేదు. దీంతో శ్రీలంక సిరీస్‌లకు అందుబాటులో ఉండకపోవచ్చని విశ్వసనీయంగా తెలుస్తోంది. 2022లో వీరిద్దరి కెరీర్ గొప్పగా సాగకపోవడం గమనార్హం. కాగా, 3 టీ20లు, 3 వన్డేలు ఆడటానికి శ్రీలంక జట్టు ఇండియాకు వస్తోంది. హార్దిక్ పాండ్యా నాయకత్వం వహించనున్నట్లు సమాచారం.