టీమిండియా భవిష్యత్‌లో ఆడనున్న టెస్టు, వన్డే, టీ20లకు హిట్ మ్యాన్ శర్మే కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇన్నాళ్లు కేవలం వైట్ బాల్ క్రికెట్లోనే కెప్టెన్సీ చేసిన రోహిత్ త్వరలో మొదలుకానున్న శ్రీలంక సిరీస్‌తో టెస్టు కెప్టెన్సీ కూడా చేయనున్నాడు. సౌతాఫ్రికా టూర్లో విరాట్ టెస్టు కెప్టెన్సీకి రాజీనామా చేయడంతో బీసీసీఐ రోహిత్ శర్మను టెస్టు కెప్టెన్‌గా నియమించింది. చాలా మంది కెప్టెన్లు కెప్టెన్సీని వదులుకునే వయసులో రోహిత్ శర్మ కెప్టెన్ కావడం గమనార్హం.