మూడో వన్డేలో సెంచరీతో చెలరేగిన రోహిత్ శర్మ వన్డేల్లో ఓ ఘనత సాధించాడు. అంతర్జాతీయ వన్డే ఫార్మాట్లో అత్యధిక సిక్సర్లు బాదిన మూడో బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. మూడో వన్డేలో 6 సిక్సర్లు బాదిన అనంతరం హిట్ మ్యాన్ ఖాతాలో మొత్తం 273 సిక్స్‌లు చేరాయి. షాహిద్ ఆఫ్రిది(351), గేల్(331) రోహిత్ కన్నా ముందున్నారు. మరోవైపు, ఈ మ్యాచులో టీమిండియా 19 సిక్స్‌లు బాది తన రికార్డును సమం చేసుకుంది. 2013లో ఆస్ట్రేలియాపై భారత్ 19 సిక్స్‌లు బాదింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే. కాగా, సొంతగడ్డపై టీమిండియాకు వరుసగా ఇది ఏడో సిరీస్ విజయం.