టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరో అరుదైన ఘనతకు చేరువలో ఉన్నాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో రోహిత్ శర్మ ఇంకో 21 పరుగులు చేస్తే 17,000 పరుగుల మైలురాయిని అందుకుంటాడు. అంతర్జాతీయ కెరీర్‌లో ప్రస్తుతం రోహిత్ 16979 పరుగులతో ఉన్నాడు. దీంతో 17వేల పరుగులు దాటితే, ఈ ఘనత సాధించిన ఏడో బ్యాట్స్‌మన్‌గా రోహిత్ జాబితాలో చేరతాడు. రోహిత్ కన్నా ముందు సచిన్(34357), కోహ్లీ(25047), ద్రవిడ్(24208), గంగూలీ(18575), ధోనీ(17266), సెహ్వాగ్(17253) ఉన్నారు.