శ్రీలంకతో జరుగుతున్న ఏకైక డే&నైట్ టెస్టులో భారత్ పట్టుబిగిస్తోంది. రెండో ఇన్నింగ్స్లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ తృటిలో అర్ధ సెంచరీ చేజార్చుకున్నాడు. బౌలర్లు హవా చూపిస్తున్న ఈ టెస్టులో రోహిత్ శర్మ 4 పరుగుల తేడాతో అర్ధ సెంచరీని చేజార్చుకున్నాడు. ఇండియా ప్రస్తుతం 100 పరుగుల వద్ద ఆడుతోంది. ఇండియా 243 పరుగుల లీడ్లో ఉంది. ఇండియా రెండు వికెట్లు కోల్పోయి ఆడుతుంది. రోహిత్ కెప్టెన్గా సక్సెస్ అవుతున్నప్పటికీ ఆటగాడిగా మాత్రం విఫలమవుతూ వస్తున్నాడు.