బంగ్లాదేశ్‌తో రెండో వన్డేలో టీమిండియా ఓటమిని చవిచూసింది. కెప్టెన్ రోహిత్ శర్మ చివర్లో భీకరంగా పోరాడినా ఫలితం లేకుండా పోయింది. కేవలం 5 పరుగుల తేడాతో టీమిండియా ఓడిపోయింది. దీంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే మూడు వన్డేల సిరీస్‌ను బంగ్లాదేశ్‌కు టీమిండియా అప్పగించేసింది. బంగ్లాదేశ్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించడానికి వచ్చి.. మరోసారి టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. శ్రేయస్ అయ్యర్(82), అక్షర్ పటేల్(56) మినహా ఎవరూ రాణించలేదు. మిగతా వికెట్లన్నీ టపటపా పడుతుండగా చావో రేవో పరిస్థితులలో క్రీజులోకి వచ్చిన రోహిత్ శర్మ బ్యాట్‌ని జులిపించాడు. 28 బంతుల్లో 51 పరుగులు చేశాడు. స్కోర్లు: బంగ్లాదేశ్ 271/7; ఇండియా 266/9.
రోహిత్ శర్మ అద్భుత పోరాటం వృథా

© ANI Photo