టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వెస్టిండీస్ అభిమానులను ప్రశంసించాడు. భారత ఆటగాళ్లు గ్రౌండ్ లో ఆడుతున్నప్పుడు నిజాయితీగా మద్దతు తెలిపారని పేర్కొన్నాడు. “నేను వెస్టిండీస్ లో ఆడటానికి ఇష్టపడుతాను.అమెరికా నుంచి ఇక్కడికి వచ్చిన భారత అభిమానులతో పాటు స్థానిక ఫ్యాన్ నుంచి కూడా టీమిండియాకు ఎల్లప్పుడూ గొప్ప మద్దతు లభిస్తుంది” అని చెప్పాడు. కాగా నిన్న విండీస్ తో జరిగిన ఫస్ట్ టీ-20 మ్యాచ్ లో భారత్ గెలిచిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ 44 బంతుల్లో 64 పరుగులు చేశాడు.