ఆదివారం అద్భుత ప్రదర్శనతో 4 వికెట్లు తీసి శ్రీలంకపై భారత్కు చారిత్రక విజయం దక్కడంలో కీలక పాత్ర వహించిన మహ్మద్ సిరాజ్…మ్యాచ్ అనంతరం ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. “కెరీర్లో తొలి 5 వికెట్లు సాధించాలని నాకు ఉండేది. కెప్టెన్ రోహిత్ కూడా అందుకోసం చాలా కష్టపడ్డాడు. కానీ ఏది జరగాలో అదే జరుగుతుంది కదా. నాలుగు వికెట్లు తీయడం సంతోషంగా ఉంది” అని సిరాజ్ చెప్పుకొచ్చాడు.