శ్రీలంకపై రోహిత్ రికార్డు

© ANI Photo

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ శ్రీలంకపై రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఆ జట్టుపై అత్యధిక పరుగులు(411) చేసిన భారత క్రికెటర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో శిఖర్ ధావన్(375) రెండో స్థానంలో, కోహ్లీ(335) మూడో స్థానంలో ఉన్నారు. అటు ఆసియా కప్‌లో భారత్ తరఫున 1042 పరుగులు చేసిన తొలి ఆటగాడిగా రోహిత్ మరో రికార్డు సృష్టించాడు. ఆసియా కప్‌లో ఇప్పటి వరకు సనత్ జయసూర్య 1220 పరుగులతో మొదటి స్థానంలో ఉండగా.. సంగక్కర(1075) రెండో స్థానంలో, సచిన్(971) నాలుగో స్థానంలో, కోహ్లీ(920) అయిదో స్థానంలో ఉన్నారు.

Exit mobile version