ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోకు భారీ ఊరట లభించింది. 2009 నుంచి ఎదుర్కొంటున్న అత్యాచార ఆరోపణల కేసును కోర్టు కొట్టివేసింది. లాస్ వెగాస్‌లోని ఓ హోటల్లో రొనాల్డో తనపై అత్యాచారం చేశాడని ఓ మహిళ ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి విచారణ జరుగుతుండగా..బాధితురాలు తరఫున సరైన ఆధారాలు సమర్పించలేకపోయారని కోర్టు కేసును కొట్టివేసింది. ప్రస్తుతం రొనాల్డో పోర్చుగల్ టీంతో కలిసి ఖతర్ వేదికగా జరగనున్న ఫుట్ బాల్ ప్రపంచకప్‌కు సన్నద్ధమవుతున్నాడు. అతడి కెరీర్లో ఇదే చివరి వరల్డ్ కప్ కావొచ్చని ప్రచారం సాగుతోంది.