హీరో విజయ్ దేవరకొండ గత రెండు సంవత్సరాలుగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ లైగర్‌తో బిజీగా ఉన్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయింది. మరోవైపు ఇదే కాంబోలో త్వరలో జన గణ మన అనే మరో చిత్రానికి వీరిద్దరూ సిద్ధమవుతున్నారు. ఇక, ఈ మూవీ తర్వాత విజయ్ దర్శకుడు శివ నిర్వాణతో ఓ సినిమా చేస్తున్నాడు. కశ్మీర్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో సమంత కథానాయికగా నటిస్తుందని సమాచారం. 2022 ద్వితీయార్థంలో ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇదిలా ఉంటే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం విజయ్ దేవరకొండ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్‌తో జతకట్టనున్నాడట. నిర్మాత సూర్యదేవర నాగ వంశీ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.