TS: బీజేపీ నేతలు రాముడి పేరు చెప్పి రౌడీయిజం చేస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. తెలంగాణలో జరుగుతున్న ఈడీ, ఐటీ దాడులపై ఆమె ధ్వజమెత్తారు. ఈ దాడులకు తెలంగాణలో ఎవరూ భయపడరని కవిత నొక్కి చెప్పారు. ఎమ్మెల్యేలకు ఎర కేసులో బీఎల్ సంతోష్ ఎందుకు విచారణకు హాజరు కావడం లేదని ప్రశ్నించారు. ‘నెలరోజులుగా మంత్రులపై ఈడీ, ఐటీ దాడులు చేస్తున్నారు. బీఎల్ సంతోష్ విచారణకు రమ్మంటే ఎందుకు రావడం లేదు. బీజేపీ నేతలు రాముడి పేరు చెప్పి రౌడీయిజం చేస్తున్నారు. ఈడీ, ఐటీ దాడులకు తెలంగాణలో ఎవరూ భయపడరు’ అని చెప్పారు.
రాముడి పేరుతో రౌడీయిజం: కవిత

© ANI Photo(file)