ఐపీఎల్ 15వ సీజన్ లో భాగంగా నేడు సన్ రైజర్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య పూణెలో మ్యాచ్ జరిగింది. టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ హైదరాబాద్ బౌలింగ్ ను చీల్చి చెండాడింది. 6 వికెట్లు కోల్పోయి 210 పరుగుల భారీ స్కోరును సాధించింది. ఆ జట్టు ఓపెనర్లు దూకుడుగా ఆడి తొలి వికెట్ కు 58 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మిడిల్, చివరి ఓవర్లలో కెప్టెన్ సంజూ శాంసన్ (55), పడిక్కల్ (41), హెట్ మెయిర్ (13 బంతుల్లో 32) చెలరేగారు. సన్రైజర్స్ బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్, నటరాజన్ చెరో 2 వికెట్లు తీయగా.. భువనేశ్వర్, షెపహర్డ్ తలో వికెట్ తీశారు.