డైరెక్టర్ రాజమౌళి, రామ్ చరణ్ భ్రమరాంబ థియేటర్లో ఉదయం RRR మూవీ కుటుంబ సభ్యులతో కలిసి చూశారు. అయితే వీళ్లు సినిమా చూసేందుకు ఆర్టీసీ బస్సులో భ్రమరాంబ థియేటర్ వద్దకు వెళ్లారు. సినిమా ముగిసిన తర్వత కూడా మళ్లీ బస్‌లో ఎక్కి వెళ్లిపోయారు. ఆర్టీసీ బస్‌లో ప్రయాణం చేసి ప్రజారవాణాను ప్రోత్సహిస్తున్నందుకు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఆర్ఆర్ఆర్ టీమ్‌కు ధన్యవాదాలు తెలిపారు.