ప్రపంచ వ్యాప్తంగా మార్చి 25న RRR సినిమా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముందు రోజు (మార్చి 24) రాత్రి 9గంటలకు AMB సినిమాస్‌లో స్పెషల్ సెలబ్రిటీ ప్రీమియర్ షో ప్లాన్ చేశారని, టాలీవుడ్ ప్రముఖులందరూ దీనికి హాజరవుతారని సోషల్ మీడియా జోరుగా ఊహాగానాలు వచ్చాయి. అయితే, ఈ వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. కానీ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన ఫ్యామిలీ కోసం రేపు రాత్రి 9 గంటలకు 52 సీట్ల రిక్లైనర్ స్క్రీన్‌ను బుక్ చేసుకున్నాడట. దీంతో ఎన్టీఆర్ తన కుటుంబం, సన్నిహితులకు రేపు RRR సినిమాని ముందే చూపించబోతున్నాడు. కాగా, రెండు తెలుగు రాష్ట్రాల్లో మార్చి 25వ తేదీ ఉదయం 4 గంటల నుంచి స్పెషల్ షోలు ప్రారంభం కానున్నాయి. ఈ సినిమా రెగ్యులర్ ఫార్మాట్లో మాత్రమే కాకుండా 3డిలో కూడా విడుదల కానుంది.