జూనియర్ ఎన్టీఆర్కు దేశంలోనే కాదు విదేశాల్లోనూ ఫ్యాన్స్ ఉన్నారన్న సంగతి తెలిసిందే. తాజాగా విదేశాల్లోని ఎన్టీఆర్ డైహార్డ్ ఫ్యాన్స్ తమ హీరోపై అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. ఫ్లోరిడాలో నివసిస్తున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ బృందం ఒక థియేటర్లో ప్రీమియర్ షో టిక్కెట్స్ మొత్తం కొనుగోలు చేశారు. ఫ్లోరిడా Cinemark Tinseltown థియేటర్లో సాయంత్రం 6 గంటల షో టిక్కెట్స్ మొత్తం కొనుగోలు చేశారు. దీంతో ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అర్థమవుతుంది. ఆర్ఆర్ఆర్ సినిమా మార్చి 25న థియేటర్లలో విడుదల కానుంది. యూఎస్ ప్రీమియర్ షోస్ మార్చి 24 నుంచి సందడి చేయనున్నాయి.