‘ఆర్ఆర్ఆర్’ మూవీ కోసం మెగా, నందమూరి అభిమానులు ఎంత ఉత్సాహంగా వేచి చూస్తున్నారో చెప్పనక్కర్లేదు. తాజాగా ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్‌లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. జనవరిలో రిలీజ్ కావాల్సిన సినిమా కోవిడ్ కారణంగా వాయిదాపడింది. అప్పుడే ఒక మిలియన్ డాలర్ అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. అయితే మూవీ రిలీజ్ పోస్ట్‌పోన్ కావడంతో అడ్వాన్స్ మళ్లీ తిరిగి ఇచ్చేశారు. అయితే ఇప్పుడు మార్చి 25న విడుదల అవుతుండగా..పది రోజులకు ముందే అమెరికాలో 1.5 మిలియన్ డాలర్ల అడ్వాన్స్ బుకింగ్స్ నమోదయ్యాయట. దీంతో సినిమా ఎన్ని వసూళ్లు రాబడుతుందో ఊహించలేమంటున్నారు నిపుణులు. ఈ సినిమా బాహుబలికి మించి ఉంటుందని రాజమౌళి ఇటీవల చెప్పడంతో మరిన్ని అంచనాలు పెరిగాయి.