ఆర్ఆర్ఆర్ చిత్రబృందం అమెరికాలో సందడి చేసింది. దర్శకుడు రాజమౌళి, ఎన్టీఆర్, రామ్‌చరణ్ కుటుంబ సమేతంగా గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ 2023కి హాజరయ్యారు. జక్కన్న భారతీయ సంప్రదాయ దుస్తులను ధరించగా.. చెర్రీ బంద్‌గళా సూట్, తారక్ బ్లాక్ టక్సెడోలో హాజరై అదరగొట్టారు. వీరితో పాటు రమ రాజమౌళి, ప్రణతి, ఉపాసన, ఎంఎం కీరవాణి ఉన్నారు. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌లో బెస్ట్ ఫిల్మ్ ఫారెన్ లాంగ్వేజ్, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు నామినేట్ అయ్యింది.