జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కించిన సినిమా RRR. ఈనెల 25న విడుదలైన ఈ చిత్రం రికార్డులు బద్దలుకొడుతోంది. విడుదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు రూ.500 కోట్లను వసూలు చేసినట్లు ట్రేడ్ అనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ తెలిపాడు. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ నాలుగు రోజుల్లో ఈ మొత్తం సాధించిందని పేర్కొన్నాడు. అటు హాలీవుడ్ నుంచి విడుదలైన ది బ్యాట్ మ్యాన్, ది లాస్ట్ సిటీ సినిమాలను కూడా వెనక్కి నెట్టేసి RRR 60 మిలియన్ల డాలర్లు కలెక్ట్ చేసినట్లు వెల్లడించాడు.