RRR సినిమా విదేశాల్లో దుమ్ములేపుతుంది. ప్రీమియర్స్ ద్వారానే 3.5 మిలియన్ డాలర్ల బిజినెస్ జరిగింది. అయితే వీకెండ్లో మొత్తం కలెక్షన్స్ 9 మిలియన్ డాలర్లకు చేరాయి. ఇక ఇండియాలో తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ భాషల్లో భారీగా వసూళ్లు చేస్తుంది ఈ సినిమా. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ఈ సినిమా అంచనాలకు మించి మంచి పాజిటివ్ టాక్తో దూసుకెళ్తుంది.